Header Banner

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు..! ఢిల్లీ పర్యటనలో రేవంత్ కీలక భేటీలు!

  Mon May 26, 2025 10:16        Politics

తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్ఠానం పెద్దల నుంచి రేవంత్‌రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా, అధిష్ఠానం సూచన మేరకు హస్తినలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. గత రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేసినట్టు తెలిసింది.

సామాజికవర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అలాగే, ఎమ్మెల్యేల నుంచి తనకు వచ్చిన వినతులను వేణుగోపాల్‌ ముందు రేవంత్ పెట్టినట్టు సమాచారం. వీటన్నింటిపై చర్చించి ప్రాథమికంగా మరోసారి పేర్లను ఖరారు చేశారని, అయితే, వీటికి ఖర్గే, రాహుల్ ఆమోదం తప్పనిసరి కావడంతో వారితో భేటీ అయ్యాక మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది.


ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!


కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TelanganaCabinet #RevanthReddy #CongressGovt #DelhiMeetings #TelanganaPolitics #CabinetExpansion